![]() |
![]() |
.jpg)
దేశమంతా కరోనా సెకండ్ వేవ్‌తో అల్లకల్లోలంగా ఉంది. చాలా మంది పేషెంట్లు హాస్పిటల్స్‌లో బెడ్లు లభించక, ఆక్సిజన్ అందుబాటులో లేక అల్లాడుతున్నారు. ఇలాంటి సంక్షోభ కాలంలో కొంతమంది సినీ సెలబ్రిటీలు దేశం విడిచి మాల్దీవుల్లాంటి ప్రదేశాలకు విహార యాత్రలు చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. మరికొంతమంది రకరకాల భంగిమల్లో తీసుకున్న ఫొటోలను, డాన్సులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇలాంటి సెలబ్రిటీలను సోషల్ మీడియా యూజర్స్ ఏకిపారేస్తున్నారు. దేశం ఇంత దారుణ స్థితిని ఎదుర్కొంటుంటే మీరు ఇలాంటి వేషాలు వస్తున్నారా?.. అని ప్రశ్నిస్తున్నారు.
.jpg)
ఇదే టైమ్‌లో శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్చర్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఆ పిక్చర్స్‌లో ఆమె పెళ్లికూతురి డ్రస్‌లో ఉండటం ఇక్కడ పాయింట్. జనరేషన్ జడ్ బ్రైడ్‌గా ఓ మ్యాగజైన్ కవర్‌పై కనిపిస్తున్న ఫొటోలవి. మహమ్మారి టైమ్‌లో అలాంటి షొటో షూట్ ఎందుకు చేశావని ఎవరైనా ప్రశ్నిస్తారని ఊహించిందేమో, ముందుగానే ఆ ఫొటోలకు క్లారిఫికేషన్ ఇచ్చింది.
.jpg)
"ఈ క్లిష్ట సమయంలో, దేశవ్యాప్తంగా మనమందరం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో సెన్సిటివ్‌గా ఉండటం ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని నేనెప్పుడూ అనుకోవట్లేదు. ఏదేమైనా ఈ కవర్, దానికి సంబంధించిన పిక్చర్స్ కొంత కాలం క్రితం, లాక్‌డౌన్‌కి ముందు షూట్ చేసినవి. మనమంతా క్షేమంగా, సాధ్యమైనంత జాగరూకతతో ఉందాం. మీరంతా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నా. Love always." అంటూ రాసుకొచ్చింది.
ఫొటోల విషయానికి వస్తే పెళ్లికూతురిగా భిన్న అవతారాల్లో పోజులిచ్చింది జాన్వీ. ఎప్పట్లా వాటిలో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.
.jpg)
![]() |
![]() |